- ఇకపై అన్ని టికెట్లకు ఒకటే ఫ్లాట్పామ్: ఆర్టీసీ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో త్వరలోనే ‘మీ సేవ’ యాప్ లో మీ టికెట్ యాప్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్టీసీ సంస్థ ప్రకటించింది. సోమవారం ఆర్టీసీ యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రజా రవాణా సేవలు అయిన ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్.. ఇక నుంచి అన్ని ఒకే యాప్ లో ప్రయాణికులకు అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. దీని ద్వారా ప్రయాణికుడు ఒకేచోట నుంచి ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ లో తన గమ్యస్థానానికి ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని పేర్కొంది.
దీని ఛార్జీలను కూడా ప్రయాణికుడు ఆన్ లైన్ లో చెల్లించవచ్చని తెలిపింది. ఇక ఆర్టీసీ సొంతగా ఎలక్ట్రిక్ ఆటోలను కొనుగోలు చేసి నడపనుందనే ప్రచారాన్ని ఆ సంస్థ ఖండించింది. ఇలాంటి ఆలోచన ఆర్టీసీకి లేదని, భవిష్యత్లో కూడా ఉండదని యాజమాన్యం స్పష్టం చేసింది.
